మెటాలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వాడుకుని వాట్సాప్ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సంధ్యా దేవనాథన్, వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా ప్రకటించారు. అందరూ తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సాప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందని, తమ డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమసేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
హెచ్‌పీఎల్ విస్తరణ, ఫాక్స్ కాన్, టీసీఎల్ వంటి గేమ్ ఛేంజర్ కంపెనీలను ఏపీకి రప్పించిన లోకేష్, మెటాతో ఒప్పందంతో తానేంటో, తన పనితీరు ఏ రేంజులో ఉంటుందో చెప్పకనే చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ గవర్నెన్స్ ఆలోచనలను అమలు చేయడంలో లోకేష్ జెట్ స్పీడుతో పనిచేస్తున్నారు. ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్, డైరెక్టర్ రవి గార్గ్, డైరెక్టర్ పబ్లిక్ పాలసీ నటాషా, ప్రభుత్వం తరపున ఐఏఎస్ అధికారులు యువరాజ్, ఆర్టీజిఎస్ సీఈఓ దినేష్ పాల్గొన్నారు.