విద్యార్థులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. దీపావళి పండగను పురస్కరించుకుని మొత్తం 6 రోజులు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వం 5 రోజులు సెలవులు ఇవ్వగా.. అందులో ఒక ఆదివారం కూడా కలుపుకుంటే మొత్తం 6 రోజులు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దీపావళి పండగ సెలవులు ప్రకటించగా.. నవంబర్ 3వ తేదీన ఆదివారం కావడంతో నవంబర్ 4వ తేదీ నుంచి మళ్లీ స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో మొత్తంగా దీపావళికి 6 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే ఈ ఆరు రోజులు సెలవులు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కావడం గమనార్హం.
జమ్మూ కాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం దీపావళి పండుగను పురస్కరించుకుని ఐదు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ (శనివారం) వరకు సెలవులు ఇవ్వగా ఆ తర్వాతి రోజు ఆదివారం కావడంతో మొత్తంగా ఆరు రోజులు విద్యార్థులకు సెలవులు దొరకనున్నాయి. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ సెలవులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జమ్మూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకటించిన ప్రకారం.. జమ్మూలో అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయనున్నట్లు తెలిపింది. హయ్యర్ సెకండరీ స్థాయి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పేర్కొంది.
తిరిగి నవంబర్ 4వ తేదీన విద్యాసంస్థలను తిరిగి తెరవనున్నట్లు జమ్మూ విద్యాశాఖ వెల్లడించింది. దసరా పండగ తర్వాత ఒకేసారి 6 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 1వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. దీపావళి పండగ సందర్భంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు వీలుగా నవంబర్ 1వ తేదీన సెలవులు ప్రకటిస్తూ.. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ నిర్ణయం తీసుకుంది.