ధర్మవరం మండలంలోని ఏలుకుంట్ల సర్పంచ్ గంగమ్మ కుమారుడైన దామోదర్ర(40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి మృతిచెందారు. శుక్రవారం తన పొలంలో ట్రాక్టర్ తో వ్యవసాయం చేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో దామోదర్ అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
దామోదర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. ఈ ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa