ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను నటుడు, డైరెక్టర్ రాధాకృష్ణన్ పార్థిబన్ ఆదివారం కలిశారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో పార్థిబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్థిబన్‌ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. జ్ఞాపికలు బహూకరించారు. పార్థిబన్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జ్ఞాపిక అందించారు. అలాగే ఓ పుస్తకాన్ని కూడా బహూకరించారు. అనంతరం పలు అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ ఫోటోలను జనసేన పార్టీ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకుంది. మరోవైపు సినీరంగానికి చెందిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం కావటంతో పలువురు ప్రముఖులు ఆయనను కలుస్తు్న్నారు.
ఈ క్రమంలోనే విలక్షణ నటుడు సాయాజి షిండే కూడా ఇటీవల పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలిపిన సాయాజీ షిండే.. అనంతరం తన ఆలోచనలను కూడా ఆయనతో పంచుకున్నారు. తాజాగా నటుడు పార్థిబన్ భేటీ కావటం విశేషం. నటుడుతో పాటుగా డైరెక్టర్ కూడా అయిన పార్థిబన్ 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్‌ను ఎందుకు కలిశారా అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా విశేషాల గురించి మాట్లాడటానికి కలిశారా లేదా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించేందుకు కలిశారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంశాలపై బాధితుల నుంచి పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల కబ్జా నుంచి పలు అంశాలపై బాధితులు తమ గోడును పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకువస్తున్నారు. తమ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం వీలైనంత సహాయం చేస్తున్నారు. అధికారులతో మాట్లాడి వెంటనే వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పింఛన్ సమస్యలు, ఇంటి సమస్యలపైనా పవన్ కళ్యాణ్ దృష్టికి అనేక వినతులు వస్తున్నాయి. ప్రజావాణి కార్యక్రమం ద్వారా కూడా జనసేన నేతలు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.