రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అమెరికాలోని రెడ్ మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయాన్ని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని కోరారు. ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.
అమెరికాలోని రెడ్‌మండ్‌లోని మైక్రో సాఫ్ట్ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ను తెలుగు ఉద్యోగులు కలిసి కరచాలనం చేసి, ఫోటోలు దిగారు. అలాగే మంత్రి లోకేష్ అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని సందర్శించి ఆ కంపెనీ సీఈవోతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, అమరావతిలో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. స్మార్ట్ గవర్నెన్స్, ఎఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించాని విజ్ఞప్తి చేశారు. యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించాలని అడోబ్ సీఈవోను మంత్రి నారా లోకేష్ కోరారు.