కదిరిలో వైసీపీ నేత కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబు దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. తనకల్లు మండలంలో పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని చంపుతానంటూ కృష్ణారెడ్డి బెదిరించాడు. కృష్ణారెడ్డి మోసం చేసి... చంపుతానని బెదిరించారంటూ పోలీసులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేతను అరెస్ట్ చేశారు. అయితే 2023లో నాడు- నేడు పనుల్లో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సమాచారం తెలుసుకొన్న కృష్ణారెడ్డి తనకు వైసీపీ ప్రభుత్వంలో ప్రముఖ నాయకులు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో బంధువులు ఉన్నారని, ఎలాంటి శిక్షలు లేకుండా తిరిగి ఉద్యోగం వచ్చేలా చేస్తానని తెలిపారు. అలాగే సస్పెన్షన్ ఎత్తివేయిస్తానంటూ ఉపాధ్యాయురాలి నుంచి రూ. 8 లక్షల వసూలు చేశాడు కృష్ణారెడ్డి. అయితే వైసీపీ పాలనలో సస్పెన్షన్ రద్దు చేయించకపోవడంతో ఎనిమిది లక్షలు వెనక్కి ఇవ్వాలంటూ వైసీపీ నేత కృష్ణారెడ్డిని ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఒత్తిడి చేసింది. దీంతో అతడు ఐదు లక్షలను తిరిగి ఇచ్చేశాడు.