సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ వ్యాఖ్యలను టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఖండించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు సచివాలయంకు వెళ్ళారా అని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఋషికొండలో భవనాలు ఎందుకు కట్టారో ఎవరికి అర్ధం కావడం లేదని పేర్కొన్నారు.