చంద్రగిరి(తిరుచానూరు):సరదాగా గడపాలని ఆటవిడుపు కోసం వచ్చిన మహిళా ప్రమాదవశాత్తు మృత్యు వాత పడగా, మరో మహిళా తీవ్ర గాయాలపాలైన ఘటన తిరుచానూ రు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.పోలీసుల కథనం మేరకు... తిరుపతి అర్బన్ మండలం సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరి(22) తన స్నేహితురాలు గౌ తమి అలియాస్ పండుతో కలసి ఆటవిడుపు కోసం తిరుచానూరు సమీపంలోని శిల్పారామానికి చేరుకుంది.సుమారు గంట పాటు శిల్పారామంలో ప లు ప్రాంతాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ క్రమంలో అక్కడే ఏర్పాటు చేసిన క్రాస్‌వీల్ ఎక్కారు. ఇద్దరు మహిళలు కూర్చుని తి రుగుతుండగా క్రాస్‌వీల్ ఉన్నట్టుండి విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో లోకేశ్వరి, ఆమె స్నేహితురాలు గౌతమి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహుకులు తేరుకుని, 108కు సమాచారం అందించారు.అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను ని ర్వహించిన వైద్యులు అప్పటికే లోకేశ్వరి మృతి చెందినట్లు నిర్ధారించగా, గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.