గుంటూరు- కృష్ణా, ఉభయగోదావరి జిల్లల పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియను టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా నిర్లక్ష్యంగా తీసుకున్నారు.అసలు పట్టించుకోవడం లేదు. పార్టీ సానుభూతిపరులు ఎవరికి వారు నమోదు చేయించుకుంటే అదే నమోదు అవుతోది కానీ… లీడ్ తీసుకుని పార్టీ క్యాడర్ ను కదిలించి… ఓటర్లను చేర్పిద్దామని అనుకోవడం లేదు. దీనిపై నివేదికలు చంద్రబాబుకు చేరడంతో ఫైరయిపోయారు.ఇటీవల ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ నమోదు ప్రక్రియను విశ్లేషించి ఒక్కొక్కరిపై మండిపడ్డారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై చంద్రబాబు ఎక్కువగా ఫైరయ్యారు. ఆయన వ్యవహారం పార్టీని బలపరిచేలా లేకపోవడంతో పాటు వ్యక్తిగత వివాదాలు, నిర్లక్ష్యం పెరిగిపోతూండటంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ నుంచి వచ్చినా ఎమ్మెల్యేగా ఇచ్చి మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేకపోతే ఎలా అని మీ బాద్యత మీరు చేయండి..మీరు చేయకుంటే నేను కూడా సీరియస్‌గా ఆలోచిస్తానని హెచ్చరించారు. ఈ ఆడియో వైరల్ గా మారింది.కూటమి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పేరాబత్తుల రాజశేఖర్ పోటీలో ఉన్నారు.. గుంటూరు, కృష్ణా నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ బరిలో ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంత మంది ఉన్నారు.. ఇంకా ఎంత మంది అర్హత ఉండి ఓటు హక్కు పొందలేదు అనే విషయంలో ప్రతీ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి ఓటు హక్కులేని పట్టబధ్రులను తక్షణమే ఓటు నమోదు చేయించాలని పార్టీ నుంచి నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి.. ఆదిగా చాలా నియోజకవర్గాలు వెనుకబాటులో ఉండడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.