ఏపీలో ఆర్థిక, నిర్వహణ సవాళ్లతో ఇబ్బందిపడుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ. 1650 కోట్ల సాయం అందించింది. సంస్థ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.
దీనిలో భాగంగా సెప్టెంబర్ 19న ఈక్విటీ కింద రూ. 500 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద రూ. 1150 కోట్లు అందించినట్లు సోమవారం వివరించింది.