ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర సహకారం కావాలంటూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రధానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. గత ప్రభుత్వం కేంద్రం కేటాయించిన 23 వేల కోట్లలో కేవలం రెండు వేల కోట్లు మాత్రమే వినియోగించిందని, అది కూడా నాసిరకం పనులు చేసి నిరుపయోగం చేశారని వివరించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలందరికీ 24 గంటల స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు సంపూర్ణ డిపిఆర్ తయారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించి రానున్న రోజుల్లో కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్న విషయాన్ని వివరించారు.