ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ.. ఎందుకో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2024, 12:08 PM

చలికాలం మొదలైపోయింది. ఇప్పటికే క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ.. క్రమంగా చలితీవ్రత పెరిగిపోతుంది. ఆరోగ్యంపై శీతాకాలం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులతో పాటు గుండె ఆరోగ్యంపై కూడా చలికాలంలో ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో గుండె పోటు రిస్క్ పెరుగుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పటికే గుండె వ్యాధులతో ఉన్న వారికి ఈ కాలంలో హార్ట్ అటాక్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణాలు ఏంటంటే.. శీతాకాలంలో శరీరంపై చల్లటి వాతావణం ఎఫెక్ట్ పడుతుంది. శరీరానికి తగినంత రక్త సరఫరా చేసేందుకు, వెచ్చదనంగా ఉంచేందుకు గుండెకు పని పెరుగుతుంది. చలి వాతావరణం వల్ల రక్త నాణాలు సంకోచిస్తాయి. దీంతో గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాల సరఫరా తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ అధికమవడం, రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. అందుకే చలికాలంలో గుండె వ్యాధులు, గుండెపోటు రిస్క్ అధికంగా ఉంటుంది.
బ్లడ్ ప్రెజర్ పెరగడం, రక్తం గడ్డకట్టే రిస్కుతో పాటు చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు కూడా తోడవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి చలికాలంలో గుండె పోటు రిస్క్ అధికమవుతుంది. చలికాలంలో చాలా మంది జీవనశైలిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. చల్లటి వాతావరణం ఉండటంతో బద్దకంగా అనిపించి కొందరు వ్యాయామాలు చేసేందుకు ఇష్టపడరు. శారీరక వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల ఫిట్‍నెస్ తగ్గడమే కాకుండా.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా కావొచ్చు. ఇది కూడా గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com