మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్‌టీపీపీ) నుంచి ఫ్లైయాష్ రవాణా విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పంచాయతీ సచివాలయానికి చేరుకుంది. కాంట్రాక్టుల కోసం కూటమి నేతల మధ్య కుమ్ములాటల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సచివాలయంకు చేరుకున్నారు.కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా తాడిపత్రి కూటమి నేతలు కాంట్రాక్టుల కోసం రోడ్డున పడ్డారు. జమ్మలమడుగు RTPP ప్లాంట్ లో ఫ్లై యాష్ వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ వర్గాల మధ్య వివాదం రాజుకుంది.
ఫ్లై యాష్ రవాణా కాంట్రాక్టు తమకంటే తమకే ఇవ్వాలని ఇరువర్గాలు పట్టుబడ్డాయి.జమ్మలమడుగు RTPP ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ ను తాడిపత్రి L&T ప్లాంట్ కు తరలించారు. ఈ కాంట్రాక్ట్ ను తమకే ఇచ్చారని తరలించేందుకు JC వర్గం లారీ లను పంపింది. అయితే, తమ నియోజకవర్గంలో వేరే వారి పెత్తనం ఏమిటని JC వర్గం లారీలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గం నిలిపివేసింది. ఇలా ఇరువర్గాల మధ్య వివాదం రోడ్డున పడి చివరికి సవాళ్లు విసురుకునే వరకు చేరింది. ఈ వివాదం కారణంగా కడప నుంచి వచ్చే లారీలను JC వర్గీయులు నిలిపివేశారు. మరోవైపు JC వర్గం లారీలు వచ్చినా జమ్మలమడుగులో లోడ్ ఎత్తని వైనం కనిపిస్తోంది. ఈ వివాదం కాస్త బజారున పడటంతో సీఎం సీరియస్ అయ్యారు. పార్టీ, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన వర్గీయుడు బుపేశ్ రెడ్డి, JC ప్రభాకర్ రెడ్డి లను సచివాలయంకు రావాలని CMO నుంచి ఆదేశాలు వచ్చాయి.