కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని అన్నారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ పోర్టును పవన్ కల్యాణ్ ఇవాళ(శుక్రవారం) పరిశీలించారు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు.సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్లదూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు.
కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు వెయ్యి లారీలు వస్తాయని తెలిపారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర 16 మందే సెక్యూరిటీ ఉన్నారని చెప్పారు. రేషన్ మాఫియా వెనుక బలమైన నెట్‌వర్క్ ఉందని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ పోర్టు నుంచి సరకుల ఎగుమతులు మాత్రమే జరగాలని తెలిపారు. కాకినాడ పోర్టు అధికారులు తనకే సహకరించలేదని అన్నారు.
![]() |
![]() |