ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి కలిగి ఉండాలని వేపాడ పిహెచ్సి సిహెచ్ఓ ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల కేంద్రంలో ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఎయిడ్స్ అంటువ్యాధి కాదని, ఈ వ్యాధి సోకిన వారు భయపడకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.