ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు (01-12-2024, ఆదివారం)

Astrology |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 05:16 PM

మేష రాశి :
మేషరాశివారికి ఈ రోజు అనుకూలంగా లేదు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఎవరినీ అతిగా నమ్మకండి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాటపట్టింపులకు పోకండి. ఉద్యోగస్తులకు శ్రమ అధికము. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రుల సహాయ సహకారముంటుంది. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. కుటుంబములో శుభకార్యక్రమాలు జరుగుతాయి. శుభవార్త వింటారు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సూర్యభగవానుని స్తోత్రం పఠించండి.

వృషభరాశి :
వృషభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శారీరక సౌఖ్యం దక్కడంతో పాటు సంతోషకరమైన వార్తలను వింటారు. మానసికానందం ఉంటుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కొద్ది శ్రమతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సూర్యాష్టకం పఠించడం మంచిది.

మిథునరాశి :
మిథునరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలు సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సూర్యభగవానుని ఆరాధించడం మంచిది.

కర్కాటకరాశి :
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి. స్థిరాస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల చదువుల విషయంలో కలసివస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారముంటుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్యాష్టకాన్ని పఠించండి.

సింహరాశి :
సింహరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలముంటుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. వృత్తి వ్యాపారపరంగా అనుకూల సమయం. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సూర్యారాధన చేయటం మంచిది.

కన్యారాశి :
కన్యారాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. నూతన ఉద్యోగావకాశముంటుంది. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. రోజువారీ కార్యకలాపాల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్యభగవానుని పూజించండి. సూర్యాష్టకం పఠించండి.

తులారాశి :
తులారాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తోటివారితో మాటపట్టింపులుంటాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నలుగురికి సహాయపడే మనస్తత్వం పెరుగుతుంది. మంచి ఉద్యోగంలో చేరే అవకాశముంది. న్యాయ సమస్యలు తీరతాయి. తులారాశి వారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్యాష్టకం పఠించండి.

వృశ్చికరాశి :
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రుణబాధలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. వృశ్చికరాశి వారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్య భగవానుని స్తోత్రం పఠించండి.

ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సూచనలు పాటించండం మంచిది. శుభకార్యాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ధనుస్సురాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి సూర్యాష్టకం పఠించండి.


మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. వివాదాలకు దూరంగా ఉంటారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో అభిప్రాయ బేధములు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరతాయి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్యభగవానుని ఆరాధించండి. అలాగే సూర్యాష్టకాన్ని పఠించండి.

కుంభరాశి :
కుంభరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. రావలసిన డబ్బు చేతికి ఆలస్యంగా అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి ఆదిత్య హృదయం పఠించండి.

మీనరాశి :
మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రయాణాలు కలసివస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. విదేశీ ప్రయాణాలను చేపడతారు. పిల్లల చదువుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బాకీలు ఆలస్యంగా వసూలు అవుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మ విశ్వాసంతో ఉంటారు. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో వ్యవహరించడం మంచిది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్య భగవానుని ఆరాధించండి. సూర్యాష్టకం పఠించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com