డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణల కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక యువకుడికి సౌదీ అరేబియా కోర్టు మరణ శిక్ష విధించింది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న ముండాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచౌటి గ్రామానికి చెందిన మహ్మద్ జైద్ (36)కు సౌదీ అరేబియా కోర్టు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై మరణశిక్ష విధించింది. డ్రగ్స్ కేసులో 2023 జనవరి 15 నుంచి జైద్ జెడ్డా సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. సౌదీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
జైద్ 2018లో సౌదీ అరేబియా వెళ్లి ఓ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని జైద్ తమ్ముడు మహ్మద్ సాద్ తెలిపారు. సౌదీలో తన సోదరుడు ప్రమాదానికి గురయ్యాడని, ఆ క్రమంలో అతడికి ఆహారం, ఇతర రోజువారీ అవసరాలు తీర్చినందుకు బదులుగా స్థానిక పోలీసు ఒకరు తన సోదరుడిని డ్రైవర్ గా వాడుకుంటున్నాడని మహ్మద్ సాద్ ఆరోపించాడు. భారత్ కు తిరిగి వెళ్తానని తన సోదరుడు పట్టుబట్టడంతో అతడిని తప్పుడు కేసుల్లో ఇరికించారని సాద్ చెప్పారు.