కర్ణాటకలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. యాడ్రామి పట్టణంలో మైనర్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఐదో తరగతి చదువుతున్న బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌పై పోక్సో చట్టం కింద కేసు చేసి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో మంగళవారం సాయంత్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాలు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన చేపట్టారు.