బిజీ జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవితం… నేడు ప్రజల ఆరోగ్యంపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇవి అనేక జీవనశైలి వ్యాధులకు కారణం అవుతుంది. అలాగే ఈ పరిస్థితులు స్త్రీ పురుషుల హార్మోన్లపై కూడా ప్రభావం చూపాయి. పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు మునుపటి నుంచి క్రమంగా తగ్గుతున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టెస్టోస్టెరాన్ అనేది మగ సెక్స్ హార్మోన్. ఇది వారి మొత్తం పునరుత్పత్తి ఆరోగ్యం, సెక్స్ డ్రైవ్, స్పెర్మ్ నాణ్యతను నియంత్రిస్తుంది. ఇది కాకుండా, కండర ద్రవ్యరాశి, ఎముక సాంద్రత, ఎర్ర రక్త కణాలు వంటి ఇతర విధులలో కూడా టెస్టోస్టెరాన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సుమారు 40 ఏళ్లు దాటిన తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయి స్థాయిలు క్రమంగా తగ్గుతూ ఉండడం సహజం. అయితే నేటి కాలంలో యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు పురుషులలో కనిపించే కొన్ని లక్షణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.
మగవారు రోజంతా కూర్చున్న తర్వాత కూడా వారికి అలసటగా అనిపించినా, లేదా ఎంతో పని చేసిన తర్వాత ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా … అది తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిల లక్షణంగా భావించవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఇది సాధారణం. కానీ పాతికేళ్లు, ముప్పయ్యేళ్ల వయసులో ఉన్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. మీకు ఎప్పుడూ శరీరం బలహీనంగా అనిపించినా, శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉన్నా… వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు పొందాలి.