మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇండియన్ ఆయిల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద ఆరుగురు వ్యక్తులు శృతి మించి ప్రవర్తించారు. పూటుగా మద్యం సేవించి అర్ధరాత్రి లారీ యార్డులో లారీ డ్రైవర్ ను చావు దెబ్బలు కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
దీంతో చావు బ్రతుకు మధ్య ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఇందుకు నిరసనగా గురువారం లారీలను నిలిపి లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలన్నారు.