పెద్దాపురంలో డివిజన్ లో 53. 62 శాతం పోలింగ్ పూర్తైనట్లు పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి తెలిపారు. గురువారం పెద్దాపురం డివిజన్లోని 11 మండలాల్లో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓటింగ్ కొనసాగుతోంది.
పెద్దాపురం డివిజన్లో 899 ఓటర్లకు గాను 482 మంది ఓట్లు వేశారన్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు.