జనవరి 8వ తేది వరకు జరగనున్న రెవెన్యూ సదస్సులను బొండపల్లి మండలం గొట్లాంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. ప్రతి జిల్లాకు ఐఏఎస్ అధికారిని ఇన్‌ఛార్జిగా ప్రభుత్వం నియమించినట్లు పేర్కొన్నారు.