మూడో కంటికి కన్పించకుండా కన్నం వేసే టైపు కాదు వాళ్లు. కత్తులతో బెదిరించి సొమ్ము కాజేసే రకం కూడా కాదు. దర్జాగా లోపలికి వస్తారు. షాపు ఓనర్‌ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ సమయంలోనే తమ పని పూర్తి చేస్తారు.
ఇదంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోతుంది. ఓనర్ తేరుకునేలోపు దోపిడీ జరిగిపోతుంది. CCTV ఫుటేజ్ చూస్తే కానీ దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకోలేరు. ఈ లేడీ కేడీలకు సంబంధించిన ఓ వీడియో తాజాగా నెట్టింట వైరలవుతోంది.