బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ ఓవల్ మైదానంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. పింక్ బాల్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుస్‌చాగ్నే మధ్య వివాదం జరిగింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కానీ ఈసారి మహ్మద్ సిరాజ్ కోపంతో లాబుస్‌చాగ్న పైకి బంతిని విసిరాడు. అయితే బంతి మార్నస్ లాబుషాగ్నేకి తగలకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్‌లో మహ్మద్ సిరాజ్, మార్నస్ లాబుషాగ్నేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఓవర్‌లోని నాల్గొవ బంతికి లాబుస్‌చాగ్నే బ్యాటింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బంతిని వేయబోతుండగా లాబుస్‌చాగ్నే పక్కకు జరుగుతాడు. దీని కారణంగా సిరాజ్ తన బౌలింగ్‌ను మధ్యలోనే ఆపవలసి వచ్చింది. ఒక అభిమాని స్క్రీన్ మధ్య నుండి బయటకు వస్తున్నాడు. అది చూసి లాబుస్‌చాగ్నే నవ్వుతూ వికెట్ల నుంచి పక్కకు జరిగాడు. దీంతో సిరాజ్ కోపంతో లాబుస్‌చాగ్నే వైపు బంతిని విసిరాడు. అయితే బంతి ఎవరికీ తగలలేదు.