పవన్‌కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కాకినాడ సీ పోర్ట్ లో చంద్రబాబు సృష్టించిన హాంగామా వెనుక పోర్ట్ వాటాలను దక్కించుకోవాలనే కుట్ర ఉందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపార సంస్థలపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం, అక్రమ కేసులను బనాయించడం వెనుక చంద్రబాబు ధనదాహం ఉందని ఆయన దుయ్యబట్టారు.కాకినాడ సీపోర్ట్‌లో వాటాలపై వివాదాన్ని సృష్టించి, తన బినామీ కేవీ రావు ద్వారా తిరిగి లబ్ధి పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. దానిలో భాగంగానే తనకు వంత పాడే ఈనాడు పత్రికలో అబద్ధాల కథనాలు రాయిస్తూ, వైయస్ఆర్‌సీపీ నాయకులు, వారికి సంబంధించిన వ్యాపార సంస్థలపై కేసులు బనాయిస్తున్నారని గుర్తు చేశారు.