మనిషిని మనిషిగా చూడటమే రాజ్యాంగమని వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్థంతి సందర్భంగా తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలు పాల్గొని, అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, వేమూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ వరికూటి అశోక్‌బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకరావు మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.