రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో వైయస్ జగన్ గత ఐదేళ్లు పాలించారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ పిత డా. బి.ఆర్.అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా బద్వేల్‌లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగ లో కల్ల అతి పెద్ద రాజ్యాంగం అన్నారు. అంబేద్కర్ పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పోరాడారని, ఆయన గొప్ప మానవతా వాది అని తెలిపారు. కార్యక్రమం లో మున్సిపాలిటీ అధ్యక్షులు సుందర రామిరెడ్డి, రాష్ట్ర పార్టీ సగర విభాగం అధ్యక్షులు బంగారు శీనయ్య, జిల్లా కార్యదర్శి యద్దా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కృష్ణ, గోపవరం మండల అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, జే.సి.యస్ కన్వీనర్ పుల్లయ్య,మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి, కౌన్సిలర్స్ , పార్టీ నాయకులు పాల్గొన్నారు.