బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమ్మేళనం పండుగ వాతావరణంను తలపించింది.
విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పాఠశాల పూర్వ విద్యార్థులు, పోలీస్ శాఖ వారు, సచివాలయం సిబ్బంది పాల్గొని పాఠశాల అభివృద్ది, విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిద రకాల పోటీలను నిర్వహించారు.