విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయుల కృషితో పాటు తల్లిదండ్రుల కృషి కూడా అవసరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జామి మండలం కుమరాం జడ్పీ హైస్కూల్లో శనివారం జరిగిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
విద్యారంగంలో పేను మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అందులో భాగమే ఈ కార్యక్రమం అని తెలిపారు. కూటమి నాయకులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.