రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట ప్రాంత ప్రజలకు అనుకూలమైన చోటులో ఆర్టీసీ యాజమాన్యం పెట్రోల్ బంకును ప్రారంభించడం ఎంతో శుభ పరిణామం అని అన్నారు. వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ అందించడం కొరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.