మెంటాడ మండలం శివారు కొండపర్తి గిరిజన గ్రామాన్ని ఆండ్ర ఎస్ఐ సీతారాం తమ సిబ్బందితో ఆదివారం సందర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా గిరిజనులకు బాల్య వివాహాలపై అవగాహన.
కల్పించడంతోపాటు నాటుసారా వినియోగాన్ని నివారించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గిరిజనులకు బియ్యం పంపిణీ చేశారు.