తెర్లాం మండల కేంద్రంలో గల గ్రంధాలయంలో ఆదివారం లైబ్రేరియన్ సిహెచ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులతో స్వాతంత్ర్య సమరయోధుల కథలు.
నీతి కథలు, ఆర్యభట్ట, అక్బర్ బీర్బల్ కథలను చదివించారు. విద్యార్థులు పఠనాసక్తి పెంపొందించుకోవాలని తెలిపారు. గ్రంధాలయాలను విద్యార్థులు విరివిగా వినియోగించుకుని జ్ఞాన సముపార్జన చేసుకోవాలని కోరారు.