10 ఏళ్ళుగా ఆరోగ్య శాఖలో విస్తృతమైన సేవలు అందించిన హెల్త్ అసిస్టెంట్లను తొలగించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ ఆదివారం విజయనగరంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు.
హెల్త్ అసిస్టెంట్లను తొలగించడం హేయమైన చర్యని అన్నారు. వీరికి ఈ వయసులో మరో ఉపాధికి ఆస్కారం లేదని ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa