పోలీసు శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో అభివృద్ధి మొదలుపెట్టామన్నారు.
ఆదివారం విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ కు ఫర్నిచర్ సమకూర్చిన దివీస్ లేబరేటరీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పాల్గొన్నారు