అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. పెన్షన్ల పెంపు, దీపం పధకాన్ని ఇప్పటికే అమలు అయ్యాయి. అలాగే మరిన్ని పధకాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలను పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆరు నెలల విజయాలను టీడీపీ నేతలు మీడియాకు వివరించారు. ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన టాప్ 20 కార్యక్రమాల వివరాల కరపత్రికను బుధవారం టీడీపీ నేతలు విడుదల చేశారు.