చిన్నప్పుడు స్కూళ్లలో ఉపాధ్యాయులు చెప్పినట్లు వినకపయినా, చదవకపోయినా, హోం వర్క్ చేయకపోయినా పనిష్మెంట్ ఇచ్చేవారు. ముఖ్యంగా బెంచీలపై నిలబడమనో, తరగతి గది బయట నిలబడమనో చెప్పేవారు. మనం కూడా భయంతో తూచా తప్పకుండా పాటించేవాళ్లం. కానీ ఓ సీఈఓ.. తన కెంపనీలోని ఉద్యోగులకు పనిష్మెంట్ ఇచ్చాడు. స్కూల్ టీచర్‌లా మారి చిన్న పిల్లలకు ఇచ్చినట్లు.. ఉద్యోగులను 30 నిమిషాల పాటు నిలబడే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా అథారిటీ సీఈఓ లోకేష్.. పని విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. తమ వద్దకు పని కోసం వచ్చే వారిని ఎక్కువ సేపు నిలబడకుండా.. త్వరగా వాళ్ల పనులు ముగించుకుని వెళ్లేలా చేస్తుంటారు. ఎప్పుడూ సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ.. తమ కంపెనీలో పని చేస్తున్న 16 మందిని గమనిస్తుంటాడు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కల్గితే వెంటనే స్పందిస్తూ.. వారి సమస్యలను కూడా తీరుస్తుంటారు.
అయితే ఇటీవలే ఓ వృద్ధుడు ఆ అథారిటీకి ఓ పని మీద వచ్చాడు. ఎంత సేపు అయినా అతడిని అక్కడి ఉద్యోగులు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆయన చాలా సేపు నిలబడి ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీసీటీవీలో గమనించిన సీఈఓ లోకేష్.. వెంటనే ఆయన వద్దకు వెళ్లారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఆయనను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదని, ఆయన పనిని వెంటనే ఎందుకు చేసిపెట్టలేదని ఉద్యోగులను నిలదీశారు. ఆపై ఒక వృద్ధుడిని ఇంత సేపు నిలబెట్టినందుకు మీక్కూడా పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్పి షాక్ ఇచ్చాడు.
ముఖ్యంగా మీరంతా 30 నిమిషాల పాటు నిలబడే ఉండాలని ఆదేశాలు జారీ చేశాడు. సీఈఓ లోకేష్ కోపంగా పనిష్మెంట్ ఇవ్వడంతో.. అక్కడ పని చేస్తున్న 16 మంది లేచి నిలబడ్డారు. అయినా వచ్చిన వారికి ఏమాత్రం అసౌకర్యం కల్గకూడదనే ఉద్దేశ్యంతో నిలబడే పనులు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిని చూసిన ప్రతీ ఒక్కరూ తెగ మురిసిపోతున్నారు. అన్ని కార్యాలయాల్లోని అధికారులు ఈయనలాగే ఉంటే.. ప్రజలకు ఎలాంటి సమస్యలూ ఉండవని చెప్పుకొస్తున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వం ఈ వీడియోను చూసి అయినా.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటివి అమలు చేస్తే.. చాలా బాగుంటుందని నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సీఈఓ ప్రభుత్వా ఆఫీసుల్లో ఉంటే రోజులు, గంటల తరబడి ప్రజలు ఆ ఆఫీసుల చుట్టూ తరిగాల్సిన బాధ తప్పుతుందని తెలిపాడో నెటిజెన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa