వక్ఫ్ బోర్డ్ సభ్యుడిగా మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మిగిలిన సభ్యులతో కలిసి ఆయన మొదటి సమావేశంలో పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ పదవి రావడానికి కారణమైన చంద్రబాబునాయుడు, లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.