ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి దూసుకొచ్చింది. వన్డేల్లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచిన ఈ స్టార్ బ్యాటర్.. టీ20ల్లో ఒక స్థానం మెరుగై మూడో ర్యాంక్ దక్కించుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) వన్డేల్లో రెండు స్థానాలు దిగజారి 13వ ప్లేస్‌కు పడిపోగా.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై టాప్-10లోకి వచ్చింది. న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్‌తో కలిసి పదో స్థానాన్ని పంచుకుంది. దీప్తి శర్మ ఐదు స్థానాలు దిగజారి 32వ ప్లేస్‌కు పడిపోయింది.భారత్‌తో వన్డే సిరీస్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన అన్నాబెల్ సదర్లాండ్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి 29వ స్థానంలో నిలిచింది. తహ్లియా మెక్‌గ్రాత్ ఎనిమిది స్థానాలు జంప్ చేసి 24వ స్థానంలో ఉంది. ఆసీస్‌తో తొలి టీ20లో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్ ఆరు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచింది. షఫాలీ వర్మ 13వ స్థానంలో కొనసాగుతోంది. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ రెండు స్థానాలు పడిపోయి ఐదో స్థానంలో నిలవగా.. అరుంధతి రెడ్డి ఏకంగా 48 స్థానాలు జంప్ చేసి 51వ స్థానం దక్కించుకుంది. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో దీప్తి రెండు స్థానాలు మెరుగై సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.