లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. అంబేద్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టారు. దీంతో ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు.నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది.
![]() |
![]() |