బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా అరకులోయ మండలంలోని ముసురువర్షం కురుస్తూనే ఉంది. కురుస్తున్న వర్షం కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతుండడంతో చలిపులి మరింత భయపెడుతుంది. దీనితో జనం బయటికి రావాలంటే జంకుతోంది. సాయంత్రమైతే చలి గజగజ వణికిస్తుంది. కురుస్తున్న వర్షంతో పలు గ్రామాల మట్టిరోడ్లు బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.