ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించనున్నారు. వయా గొడవర్రు రోడ్డు పనుల పరిశీలిస్తారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్య పాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంచాయతీ రాజ్, వాటర్ వర్క్స్ అధికారులతో సమస్యల గురించి చర్చిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసే దిశగా డిప్యూటీ సీఎం పర్యటిస్తున్నారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో ఉన్నతాధికారులు పనుల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకుంటున్నారు.రెండు రోజుల కిందటే ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం అయిన మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మౌళిక వసతులు లేక అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ఎన్నికల ప్రచార సమయంలో పరిశీలించిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు.