టీడీపీ సభ్యత్వ నమోదులో అలసత్వం వీడాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. ఈమేరకు ఆదివారం జి.సిగడాం, మండల కేంద్రంలో నిర్వహించిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం నుంచి లక్ష సభ్యత్వాలను లక్ష్యం గా పెట్టుకున్నామని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాల న్నారు.
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం ఇటీవల వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయిన సూర్యనారాయణ, నాయిన వెంకటరావు.. అలాగే అనారోగ్యంతో బాదపడుతున్న చెట్టుపోదిలాం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు భూపతి శ్రీరామూర్తిని ఆయన పరామర్శించారు. ఆయన వెంట నాయకులు కుమరాపు రవికుమార్, బాలబొమ్మ వెంకటేశ్వరరావు, టంకాల మౌళీశ్వరరావు, కుదిరెళ్ల బుజ్జి, కంచరాన సూరన్నాయుడు, సిరుగుడి గోవిందరావు, కూనుబిల్లి కూర్మారావు, మజ్జి కన్నంనాయుడు, జక్కంపూడి దాసు, కామోజలు సీతారాం, బెవర జగన్నాథరావు, తదితరులు ఉన్నారు.