పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దిశ మార్చుకుంది. ప్రస్తుతం ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
తీరానికి దగ్గరగా ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉందని పేర్కొంది. మరో రెండు రోజుల పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.