విశాఖలో పదమూడేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరుష్ అమన్ (13) అనే బాలుడు బాత్రూంలో షూ లేస్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి తల్లిదండ్రులు జార్ఖండ్‌లో ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో అమన్ విశాఖలో తాత నివాసంలో ఉంటున్నాడు. ఈక్రమంలోనే బాలుడు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
అయితే బాలుడు ఎక్కువగా మొబైల్‌లో వీడియో గేమ్స్ ఆడుతుంటాడని తాతా వినోద్ కుమార్ షా.. పోలీసులకు తెలిపాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.