అల్లూరి జిల్లా మన్యం అరకులోయ మండల పరిసర ప్రాంతంలో పొగ మంచు తీవ్రత కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించనంతగా పొగ మంచు కమ్ముకోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం ఇల్లా నుంచి బయటకు రావడానికి భయపడిపోతూ రోజువారీ పనులు చేసుకుంటున్నారు.