గుంటూరుకు చెందిన అంకెం వీరస్వామి స్పా సెంటర్ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. రాజమండ్రి జేఎన్ 656 'హ్యాపీ స్ట్రీట్ దగ్గర్లోని ఓ స్పా సెంటర్లో ఆదివారం రాత్రి ప్రకాశ్ నగర్ పోలీసు స్టేషన్ సీఐ బాజీలాల్ తనిఖీ చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా నిర్వాహకులు, ఇద్దరు విటులు, ఆరుగురు బాధిత యువతులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించామని సెంట్రల్ జోన్ డీఎస్పీ రమేశ్ బాబు తెలిపారు.