విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆదివారం అభినందించారు. ఈనెల 14, 15 తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా నుంచి 16మంది క్రీడాకారిణులు, 34 మంది పురుషులు మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొని 144 బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.కార్యక్రమంలో కోచ్ శ్రీరాములు పాల్గొన్నారు.