ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరూ ఫో న్, పే, గుగూల్ పే తదితర వాటి ద్వారా లావాదేవీలు జరుపుతున్నా అన్నవరం దేవస్థానంలో ఇప్పటివరకు అటువంటి సౌకర్యం కల్పించకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ఈవో సుబ్బారావు బా ధ్యతలు స్వీకరించాక భక్తుల ఇబ్బందులు దృష్టి లో ఉంచుకుని రిసెప్షన్ కార్యాలయం, పశ్చిమరాజగోపురం వద్ద కౌంటర్లను ఏర్పాటు చేశామని.. భక్తులు వ్రతాలు, దర్శనం టిక్కెట్లు, విరాళాలు, వసతి సౌకర్యం కోసం ఇకపై డిజిటల్ పేమెంట్‌ల ద్వారా చెల్లింపులు చేపట్టవచ్చని దేవస్థానం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.