వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులతో కూటమి ప్రభుత్వం తమను వేధిస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై కామెంట్స్ చేసినప్పుడు సభ్యత ఏమైందంటూ కౌంటర్ అటాక్ చేశారు.
తన తప్పులు లేని రోజున తాను గడ్డం తీసేస్తానని, అందుకే తాను గడ్డం పెంచుతున్నానని.. ఊరికే కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు కాబట్టి వైఎస్సార్‌సీపీ నేతలు ఇవాళ బయటికి వస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ హయాంలో అయిదేళ్లు మమ్మలను బయటికి రానివ్వలేదని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆ రోజు కొల్లు రవీంద్ర ధైర్యంగా జైలుకు వెళ్ళారని.. నువ్వు (పేర్ని నాని) ఇవాళ దొంగ ఏడుపులు ఏడుస్తున్నావని ఆయన అన్నారు.