జనవరి 5వ తేదీన విజయవాడ సమీపంలో జరిగే హైందవ శంఖారావ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ ధర్మ ప్రచారక్ బసవ శంకర్రావు పేర్కొన్నారు. గురువారం అవనిగడ్డ మండలంలోని పలు దేవాలయాలను హిందు ప్రముఖులు సందర్శించి భక్తులకు కరపత్రాలను పంపిణీ చేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు ఈ కార్యక్రమం జరుగుతుందని, భారీ ఎత్తున హిందూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. గరికిపాటి సీతారామాంజనేయులు, ఏడుకొండలు పాల్గొన్నారు.